రూ.7 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధికి చెందిన 7 మంది కళ్యాణ లక్ష్మీ పథకం లబ్ధిదారులకు రూ.7,00,812/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి తన నివాసం వద్ద కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు వరంగా మారాయని చెప్పారు. పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లు భారం కావొద్దనే సీఎం కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో భూపాల్, స్థానిక చైర్మన్ సన్న శ్రీశైలం యాదవ్, వైస్ చైర్మన్ గంగయ్య నాయక్, పాక్స్ చైర్మన్ నరేందర్ రాజు, కౌన్సిలర్ సువర్ణ, కోఆప్షన్ సభ్యుడు వెంకటేష్, సీనియర్ నాయకులు దేవేందర్ యాదవ్, లక్ష్మణ్ గౌడ్, డైరెక్టర్ మధుసూధన్ యాదవ్, డిటి సుధాకర్ మరియు లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
రూ.7 లక్షల విలువ చేసే కళ్యాణ లక్ష్మీ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే…
Related Posts
ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్
SAKSHITHA NEWS ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ శంకర్పల్లి: ప్రభుత్వ వైద్య సేవలు మెరుగుపరచాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్, స్పెషల్ ఆఫీసర్ సురేష్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయంలో వైద్య అధికారులతో…
ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత
SAKSHITHA NEWS ప్రయోగాలకు ప్రయోజనం చేకూర్తేనే సార్ధకత 52వ రాష్ట్రీయ జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన ముగింపు సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిసాక్షిత వనపర్తి 52వ రాష్ట్రీయ జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో విద్యార్థులు ప్రదర్శించిన ప్రయోగాలకు సార్ధకత చేకూరేల, ఉపాధ్యాయులు…