SAKSHITHA NEWS

*రూ. 6,00,000/- ఆరు లక్షల రూపాయల విలువ గల CMRF LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకు అందచేసిన PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ *

సాక్షిత : హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ కి చెందిన శివనందుని చైతన్య కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 5,00,000 /- ఐదు లక్షల రూపాయలు మరియు మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీ కి చెందిన ఈశ్వర్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,00,000 /- ఒక లక్షల రూపాయలు ఆర్థిక సహాయానికి సంబంధించిన CMRF- LOC మంజూరి పత్రాలను బాధిత కుటుంబాలకి అందచేసిన గౌరవ PAC చైర్మన్, ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరి అయిన వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి అని

CMRF LOC – వివరాలు

  1. హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ కి చెందిన శివనందుని చైతన్య కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 5,00,000 /- ఐదు లక్షల రూపాయలు

2.మాదాపూర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీ కి చెందిన ఈశ్వర్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా (CMRF-LOC) ద్వారా మంజూరైన 1,00,000 /- ఒక లక్ష రూపాయలుగా మంజూరి అయినవి అని, మొత్తము 6,00,000/- రూపాయలుగా మంజూరి అయినవి అని,
అదేవిధంగా ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని ఎమ్మెల్యే గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని.. ఎమ్మెల్యే గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.

ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రఘునాథ్ యాదవ్, ప్రసాద్, సాంబశివరావు, శ్రీనివాస్ , గుమ్మడి శ్రీనివాస్, DSRK ప్రసాద్, పురెందర్ రెడ్డి, సైదేశ్వర్, ప్రశాంత్, పూర్ణ, మరియు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS