SAKSHITHA NEWS

రైతులకు తక్షణమే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని కోరుతూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సీఎం రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. డిసెంబర్‌ 9నే చేస్తామని మేనిఫెస్టోలో చెప్పారని గుర్తు చేశారు. రుణమాఫీ అయ్యాక మళ్లీ రూ.2 లక్షల రుణం తీసుకోవాలన్నారని తెలిపారు. రేవంత్‌ మాటలు నమ్మి లక్షల మంది అప్పులు తీసుకున్నారన్నారు.

‘‘రేవంత్ ప్రకటించినట్లు డిసెంబర్‌ 9న రుణమాఫీ జరగలేదు. అధికారంలోకి వచ్చి 4 నెలలవుతున్నా ఒక్క రైతుకూ అందలేదు. దీన్ని ఏవిధంగా అమలు చేస్తారో స్పష్టం చేయాలి. పంట మద్దతు ధరపై రూ.500 బోనస్‌ ఇవ్వాలి. ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం అందించాలి. సాగునీరు, 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ సరఫరా చేయాలి. రాష్ట్రంలో ఈ నాలుగు నెలల కాలంలో 209 మంది అన్నదాతలు చనిపోయారు. రుణమాఫీ విషయంలో బ్యాంకర్ల ఒత్తిళ్లు, వేధింపులకు తట్టుకోలేక ప్రాణం తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది’’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ….

WhatsApp Image 2024 04 03 at 2.44.06 PM

SAKSHITHA NEWS