SAKSHITHA NEWS

బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి మంత్రి రోజా కౌంటర్
బీజేపీ పార్టీని బావ పార్టీగా మార్చేశారంటూ ఎద్దేవా
అభియోగాలు, సెక్షన్లను పేర్కొంటు కౌంటర్ ట్వీట్

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టు (chandrababu naidu arrest) ను ఖండిస్తూ బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ట్వీట్‌కు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. సరైన నోటీసులు ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్‌లో కనీసం ఆయన పేరు కూడా పెట్టకుండా, ఎలాంటి వివరణ తీసుకోకుండా, ప్రొసీజర్ ఫాలో కాకుండా చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేయటం సమర్థనీయం కాదని.. దీన్ని బీజేపీ ఖండిస్తోందంటూ పురందేశ్వరి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై స్పందిస్తూ.. మంత్రి రోజా తనదైన శైలిలో కౌంటర్ ట్వీట్ చేశారు.

క్రైం నెంబర్ 29/2021 కింద అరెస్ట్ చేశారని.. సీఆర్పీసీ 50(1)(2) సెక్షన్ కింద నోటీసులు ఇచ్చారని రోజా పేర్కొన్నారు. 9/12/2021 న సీఐడీ EOW వింగ్ FIR నమోదు చేసిందని తెలిపారు. 120(B) నేరపూరితకుట్ర, సెక్షన్ 166,167 పబ్లిక్ సర్వెంట్ చట్టాన్ని ఉల్లంగించి నేరానికి పాల్పడటం, సెక్షన్ 418 తన అధికారాన్ని దుర్వినియోగం చేయటం, IPC సెక్షన్ 420 మోసం, చీటింగ్, నమ్మక ద్రోహం,IPC సెక్షన్ 465, 468 ఉద్దేశపూర్వకంగా మోసం కోసం ఫోర్జరీ, 471 నకిలీ పత్రాలు లేదా ఎలక్ట్రానిక్ రికార్డు సృష్టించడం, సెక్షన్ 409 పబ్లిక్ సర్వెంట్ తన ఆధీనంలోని ఆస్తిని అక్రమంగా కట్టబెట్టడం, 12,13(2) అవినీతికి పాల్పడటం, 13(1)(C)(D)పబ్లిక్ సర్వెంట్ అవినీతికి పాల్పడటం.. అంటూ చంద్రబాబుపై మోపిన అభియోగాలు, సెక్షన్లతో సహా రోజా తన ట్వీట్‌లో వివరించారు. కాగా.. చివర్లో.. ఇప్పుడు చెప్పండి చంద్రబాబు అరెస్ట్ ఎందుకు సమర్థనీయం కాదు అంటూ పురందేశ్వరిని రోజా ప్రశ్నించారు. అంతేకాదు.. భారతీయ జనతా పార్టీని కాస్త బావ జనతా పార్టీగా మార్చేశారా అంటూ ఎద్దేవా చేశారు.

అంతకు ముందు.. కర్మ సిద్దాంతం ఎవ్వరినీ వదిలిపెట్టదని.. చేసిన తప్పులకు అనుభవించాల్సిందే అంటూ చంద్రబాబు అరెస్టయిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు రోజా. అంతకంటే ముందు.. ఎవ్వరు పుట్టుకతోనే ఆనందంగా ఉండరని.. కానీ ఆనందాన్ని పొందే నైపుణ్యం మాత్రం పుట్టుకతో కలిగి ఉంటారని.. కోట్ ఆఫ్ ది డే పేరుతో ట్విట్ చేశారు.


SAKSHITHA NEWS