SAKSHITHA NEWS

124 డివిజన్ పరిధిలోని చక్రధరి నగర్ కాలనీలోని రోడ్డు నెంబర్-4 లో చిన్నపాటి వర్షానికి కూడా రోడ్డు పైన నీరు నిలిచి ఇబ్బందిగా ఉందని కాలనీ ప్రజలు సమస్యను శేర్లింగంపల్లి శాసనసభ్యులు ఆరేకపూడి గాంధీ దృష్టికి తీసుకుని వెళ్లగా ఎమ్మెల్యే అదేశాలమేరకు యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ చక్రధరి నగర్లో AE సుభాష్ మరియు కాలనీ వాసులతో కలిసి పర్యటించి రోడ్డు నెంబర్-4 ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా యువనేత మాట్లాడుతూ సీసీ రోడ్డు కొరకు కొలతలు తీసుకుని అంచనా వ్యయాన్ని వేసి అత్యవసరంగా మంజూరైయ్యే విధంగా చూస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారన్నారు. కార్యక్రమంలో కాలనీ ప్రెసిడెంట్ యలమంద, వైస్ ప్రెసిడెంట్ ఎం.సుభాష్, జనరల్ సెక్రటరీ బాలరాజు, దస్తగిరి, భాస్కర్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, ప్రసాద్, సత్యనారాయణ, మోహన్ రావు, శివయ్య, తదితరులు పాల్గొన్నారు.