డిగ్రీ సెమిస్టర్ ఫలితాల్లో ఆర్జేసి ప్రభంజనం
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసిన డిగ్రీ 2,4వ సెమిస్టర్ ఫలితాల్లో ఖమ్మం ఆర్జేసి కళాశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచి ఉత్తమ ఫలితాలు సాధించారని కళాశాల చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు.వీరిలో బీకాం లో కె.మానస 9.07, జి.గోపిక 8.66, ఒ.శ్రీ దివ్య 8.10పాయింట్లు సాధించారన్నారు.అదేవిధంగా బీఎస్సీ (ఎం)లో ఏ.లక్ష్మీ నాగ సాయి మేఘన 8.29, బీఎస్సీ(బి)లో వి హరిక 8.80, వి.నిఖిల్ 8.38,ఎస్. సునీత 8.08 మార్కులు సాధించారని వెల్లడించారు. అదేవిధంగా బిఎ లో ఎస్.డి. సమ్రీన్ 7.90, నికత్ తజిన్ 7.70, ఎన్. మహేందర్ 7.56, ఎస్.డి.ఇఫ్తీజం 7.50పాయింట్లు సాధించి ఆర్జేసి విద్యార్థుల సత్తా చాటారని పేర్కోన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ కళాశాల విద్యార్థులు గతంలో పలువురు వివిధ రంగాల్లో ఉన్నత మైన స్థితి లో స్థిర పడ్డారని తెలిపారు. అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్దులకు దీటు గా క్యాంపస్ ప్లేస్ మెంట్ లలో విజయం సాధించి ఉద్యోగాలు సాధించడం గర్వకారణం అన్నారు. దీనికి తమ కళాశాల విద్యార్థులపై అధ్యాపకుల పర్యవేక్షనే కారణమని తెలిపారు. విద్యార్థులు వుత్తమ ఫలితాలు సాధించడానికి కృషి చేసిన అధ్యాపకులను ఆయన ఈ సందర్భంగా అభినందించారు. భవిష్యత్లో కూడా తమ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించే లా యాజమాన్యం కార్యా చరణ రూపొందించిందని వివరించారు. అనంతంరం ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్దులను అభినందించారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎ.లింగయ్య అధ్యాపకులు పాల్గొన్నారు….