SAKSHITHA NEWS

పేదల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి అని ఘాటుగా విమర్శించిన మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు

మల్కాజిగిరిలో బిఆర్ఎస్ నాయకుడు జగదీష్ గౌడ్ అమ్మవారి మండపం వద్దకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ గొప్పతనాన్ని ఈరోజు ప్రపంచం గుర్తిస్తుందని తెలియజేశారు. అలాగే తెలంగాణ అభివృద్ధి చేసిన ఘనత బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దే అని తెలిపారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణను ముఖ్యంగా హైదరాబాద్ ను హైడ్రాను అడ్డం పెట్టుకొని బ్రష్టు పట్టిస్తున్నాడని విమర్శించారు.

దుర్గామాత రేవంత్ రెడ్డికి మంచి స
సద్బుద్ధిని ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలియజేశారు.

హైడ్రా వల్ల ప్రజలు తమ నివాసాలు కోల్పోతున్నారని అన్నారు.

శనివారం ఆదివారం వచ్చిందంటే ప్రజలు గజగజ వణుకుపోతున్నారని విమర్శించారు.

పేద ప్రజల ఉసురు పోసుకుంటున్న రేవంత్ రెడ్డి పద్ధతి మార్చుకొని ఉండాలని అన్నారు.

ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు, భక్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..


SAKSHITHA NEWS