SAKSHITHA NEWS

తెలంగాణ వచ్చిన పదేం డ్లకు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం రేవంత్ సర్కారు కు ప్రభుత్వపరంగా ఇదే తొలి పండుగ.

దీంతో ధూమ్ ధామ్ గా వేడుకలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అవతరణ దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్ లో పదివేల మందితో ఘనంగా నిర్వ హించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లుచేయనుంది.

రాష్ట్రం ఏర్పడిన పదేండ్లకు కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావడంతో తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీని ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణంచింది.

వేలాదిమంది ఉద్యమించి నా, ప్రధాన ఉద్యమకారు డిగా, తెలంగాణ తెచ్చిన గొప్ప నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేరు ఉంది.

కాబట్టి తెలంగాణ అవ తరణ దినోత్సవం రోజు సోనియాతోపాటు కేసీఆర్ ను కూడా ఘనంగా సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయనకు ఆహ్వానం పంప నున్నట్టు సమాచారం..

WhatsApp Image 2024 05 22 at 17.36.01

SAKSHITHA NEWS