SAKSHITHA NEWS

స్పందన” అర్జీలను సకాలంలో పరిష్కరించాలి – తిరుపతి జిల్లా కలెక్టర్
సాక్షిత, తిరుపతి బ్యూరో: స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాల వ్యవధి లోపల సమస్యలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె.వెంకటరమణా రెడ్డి అన్నారు. సోమవారం తిరుపతి జిల్లా కలెక్టరేట్ లో జరిగిన స్పందన కార్యక్రమoలో జాయింట్ కలెక్టర్ బాలాజీ, డి.ఆర్.ఓ శ్రీనివాస రావు పాల్గొని జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీ దారుల నుండి అర్జీలను స్వీకరించారు. మొత్తం అర్జీలు 91 రాగా, ఇందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 65 , పంచాయితీ రాజ్ శాఖ కు సంబంధించి 8, డి.సి.హెచ్.ఎస్ కు సంబంధించి 1, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సంబంధించి 3, పోలీస్ శాఖ కు సంబంధించి 1, బి.సి సంక్షేమ శాఖ కు సంబందించి 1, గురుకుల పాఠశాలకు సంబందించి 9, మైనారిటీ శాఖ కు సంబంధించి 1, తుడా 1, ఎస్.ఈ ట్రాన్స్కో కు సంబందించి 1 అర్జీలు రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందన కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీల మీద తరచూ సమీక్షిస్తున్నారని, జిల్లా అధికారులు వచ్చిన అర్జీల మీద సత్వరం చర్యలు గైకొని పరిష్క రించాల్సిందిగా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంబందించిన అధికారులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS