Response applications should be resolved in time: Mayor Dr. Sirisha
స్పందన అర్జీలు సకాలంలో పరిష్కరించాలి: మేయర్ డాక్టర్ శిరీష
ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించండి: కమిషనర్ హరికృష్ణ
డయల్ యువర్ కమిషనర్ ఫోన్ ద్వారా 14 ఫిర్యాదులు
స్పందన కార్యక్రమం కు 12 ఫిర్యాదులు
నగరపాలక
సాక్షిత : డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణీత కాలం వ్యవధి లోపల నగర ప్రజలు అందజేసిన డయల్ యువర్ కమిషనర్ ఫోన్లు ద్వారా ఫిర్యాదులు, స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలు వెంటనే పరిష్కరించాలని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరికృష్ణ అధికారులు ఆదేశించారు.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉదయం డయల్ యువర్ కమీషనర్ ఫోన్ ద్వారా ఫిర్యాదులు ఫుట్ పాత్ పైన తోడు బండ్లు వ్యాపారం చేస్తున్నారు, ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. సప్తగిరి నగర్ లో మొత్తం గొంతులు ఏర్పడి పూర్తిగా పాడియినది, కొత్త రోడ్డు వేయవలసిందిగా కోరుచున్నారు. మధురానగర్ లో భూగర్భ డ్రైనేజ్ పొంగుచున్నది,
సమస్య పరిష్కరించాలని కోరుచున్నాము. గాజు వీధి, ఇంటి పన్ను కొరకు. గిడ్డంగి వీధి, స్ట్రీట్ లైట్ వెలగడం లేదు. శ్రీనగర్ కాలనీ డ్రైనేజ్ వాటర్ రోడ్డుపై వచ్చుచున్నవి. కొర్లగుంట దగ్గర రోడ్డు వైడెనింగ్ కొరకు గుంతులు తవ్వుతున్నారు, ట్రాఫిక్ ఇబ్బందు లేకుండా త్రవ్వినచోట భారీకెడు ఏర్పాటు చేయవలసిందిగా కోరి ఉన్నారు. చంద్రశేఖర్ రెడ్డి కాలనీ, కల్వర్టు కుంగిపోయినది, దాన్ని మరమ్మతులు చేయవలసిందిగా కోరి ఉన్నారు.
రామతులసి కళ్యాణ మండపం వద్ద, రోడ్డు ఆక్రమించినారు. ఇందిరా నగర్, ఇంటి పన్ను తగ్గింపు కొరకు. బొమ్మగుట స్కూల్ వద్ద వాహనాలు పార్కింగ్ చేస్తున్నారు, చర్యలు తీసుకోవాల్సిన కోరుచున్నాము.
ఎయిర్ బైపాస్ రోడ్డు ఫైర్ ఎన్ఓసి కొరకు దరఖాస్తు చేసుకున్నాము, ఇంతవరకు ఎల్ఓసి ఇవ్వలేదు. నువ్వు ఇంద్ర నగర్ భూగర్భ డ్రైనేజీ తరచూ పొంగుచున్నది, పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కోరినారు. స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులు గరుడాద్రి నగర్ పన్ను విధించడం గురించి.
కొర్లగుంట మారుతి నగర్, టి డి ఆర్ బాండ్ కొరకు. లక్ష్మీదేవి యూపీఎస్సీలో ఆయాగా పనిచేయుచున్నారు, ప్రమోషన్ కొరకు అర్జీ సమర్పించినారు. రైల్వే కాలనీ, ఆక్రమణ నిర్మాణం చేపడుతున్నారు. న్యూ మారుతి నగర్ ఎం ఆర్ పల్లి, ఇంటి పన్ను తగ్గింపు కొరకు. కొరమీను గుంట, టిడిఆర్ బాండ్ కొరకు.
మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరికృష్ణ మాట్లాడుతూ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత,ఉప కమిషనర్ చంద్రమౌలేశ్వర రెడ్డి, హెల్త్ అధికారి హరికృష్ణ,ఆర్.ఓ.లు సేతు మాధవ్,కె.యల్.వర్మ, మేనేజర్ చిట్టిబాబు, సెక్రటరీ రాధిక,డి.సి.పి దేవి కుమారి,ఏ.సి.పి.లు బాలసుబ్రమణ్యం, షణ్ముగం, సూపర్డెంట్ రవి తదితరులు పాల్గొన్నారు.