సాక్షిత తిరుపతి నగరం :కార్పొరేషన్ కి వచ్చే స్పందన సమస్యలను, అదేవిధంగా జగనన్న స్పందన కార్యక్రమానికి వచ్చే సమస్యలను పరిశీలించి ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేసి, పని పూర్తి అయినట్లు స్పందన కార్యక్రమానికి అప్ లోడ్ చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ అన్నారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం అన్ని విభాగాల అధిపతులతో ప్రత్యేక సమావేశాన్ని కమిషనర్ హరిత నిర్వహించారు.
జగనన్న స్పందన సమస్యలను, అదేవిధంగా డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమంలో వచ్చే ప్రజా పిర్యాదులను ఆలస్యం కాకుండా పరిష్కరించాలన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బంది క్రీడాకారులకు సహాయ సహకారాలు అందిస్తూనే వుండాలన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష రెండవ దశ వైధ్య శిబిరాలకు చిక్సితలు అవసరమైన వారిని జనవరి 3 నుండి జూన్ 30 వరకు జరిగే మెడికల్ క్యాంపులకు పంపించేందుకు సచివాలయ కార్యదర్శులు, వాలంటీర్ల సహకారంతో కృషి చేయాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటి జి.ఎం చంద్రమౌళి, రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, మేనేజర్ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.