Request to MLA to work to allow walkers in IDPL colony and military grounds
ఐడీపీఎల్ కాలనీ, మిలిటరీ గ్రౌండ్ లలో వాకర్స్ కు అనుమతిచ్చేలా కృషి చేయాలని ఎమ్మెల్యేకు వినతి…
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని బాపునగర్, శ్రీరామ్ నగర్, పద్మ నగర్ ఫేస్-2 కాలనీ వాసులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద నియోజకవర్గ టీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా శ్రీరామ్ నగర్ కాలనీ సమీపంలోని మిలిటరీ గ్రౌండ్ మరియు ఐడీపీఎల్ కాలనీలో వాకర్స్ కు ఉదయం, సాయంత్రం అనుమతించే విధంగా కృషి చేయాలని కోరుతూ ఎమ్మెల్యే కి వినతి పత్రాన్ని అందజేశారు.
దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి అందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెంటయ్య ముదిరాజ్, కృష్ణయాదవ్, పోచయ్య, సుబ్బారావు, బాబు, ఎల్లారెడ్డి, మచ్చెందర్ తదితరులు పాల్గొన్నారు