SAKSHITHA NEWS

స్కిల్ డెవలప్మెంట్ కేసులో సీఎం చంద్రబాబుకు ఊరట?

అమరావతి:
స్కిల్ కేసులో కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చింది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2023 సెప్టెంబర్ 9న స్కిల్ కేసులో అరెస్ట్ చేశారు.

ఈ కేసులో కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో 53 రోజుల తర్వాత ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈ కేసులో ఈడీ అధికారులు దాఖలు చేసిన చార్జీషీట్ లో డిజైన్ టెక్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతర సంస్థలకు చెందిన రూ. 23.5 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

సెమెన్స్ భాగస్వామ్ంతో ప్రభుత్వ స్కిల్ అండ్ ఎంటర్ ప్రైన్యూర్ షిప్ డెవలప్ మెంట్ ప్రాజక్టులో నిధుల దుర్వినియోగానికి చంద్రబాబుకు ఎలాంటి సంబంధం లేదని ఈడీ స్పష్టం చేసింది.

చంద్రబాబు ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించ డానికి రెండు నెలల ముందు అంటే ఏప్రిల్ 5న విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టులో చంద్రబాబుతో పాటు మరికొందరిపై సీఐడీ చార్జీషీట్ దాఖలు చేసింది.

నిధుల మళ్లింపు కోసం ఎంట్రీ ప్రొవైడర్ల సేవలను తీసుకున్నారని, ఇందుకు వారికి కమిషన్ చెల్లించారని చెప్పారు. డిజైన్ టెక్ సిస్టమ్స్ కు చెందిన రూ. 31.2 కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను ఈడీ జప్తు చేసింది.


SAKSHITHA NEWS