ప్రభుత్వ ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు
శ్రీకాకుళం జిల్లా పలాస తాసిల్దార్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఉద్యోగులు తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని రిలే నిరాహార దీక్షకు పూనుకున్నారు.ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల జిల్లా కార్యదర్శి అలికాన రాజేశ్వరి మాట్లాడుతూ….ఉద్యోగులకు సిపిఎస్ రద్దు చేస్తామని ఇచ్చిన హామీ నేటి వరకు ప్రభుత్వం నెరవేర్చలేదన్నారు.తమ సమస్యలు తీరని ఎడల నవంబర్ 1 నుంచి ఉద్యమం ఉదృతం చేస్తూ.. ప్రాణ త్యాగానికి సిద్ధమన్నారు.