Registrations should be done in the old way
పాత…. పద్ధతి లోనే రిజిస్ట్రేషన్ లు చేయాలి. . . షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యర్యంలో ధర్నా.
రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
ఆగిపోయిన ఏజీ పి ఏ, జి పి ఏ, ప్లాట్లను రిజిస్ట్రేషన్ లు పాత పద్ధతి లోనే చేయాలనీ షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు గౌడ్ తెలిపారు. ఆయన అధ్యర్యంలో రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణం లోని సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
గ్రామ పంచాయతీ లే అవుట్లు, జి పి ఏ, ఏ జి పి ఏ ప్లాట్లను యధావిధిగా పాత పద్ధతి లోనే చేయాలనీ అలాగే కోర్టు ఆర్డర్ పై చేసిన రిజిస్ట్రేషన్ లు పాత పద్ధతి లోనే సాగాలని డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు పెద్దఎత్తున సబ్ రీజస్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.
ఆగిపోయిన రిజిస్ట్రేషన్ ల వలన చాలా మంది కి ఇబ్బందిగా మారిందని, కష్టాల పాలవుతున్నారని అన్నారు. గవర్నమెంట్ కు కూడా దీని వలన రెవిన్యూ చాలా తగ్గిందని అన్నారు. ప్రభుత్వ విప్ సోమేశ్ కుమార్ కి, ఐటీ మినిస్టర్ కే టీ ఆర్ కి సవినియంగా కోరుకునేది ఏమనగా పాత పద్ధతి లోనే రిజిస్ట్రేషన్ లు కొనసాగించాలని కోరారు.
ఇప్పటికే అందరికి మెమోరాండం అందజేశామని అన్నారు. తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ప్రవీణ్ ఆదేశాల ప్రకారం రాష్ట్ర మంతటా ధర్నాలు చేపట్టమని తెలిపారు. ఈ ధర్నాలో షాద్ నగర్ రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు గౌడ్, ఉపాధ్యక్షుడు కబీర్
,జనరల్ సెక్రటరీ మంచిరేవుల అశోక్, ట్రేజరర్ సతీష్,జాయింట్ సెక్రటరీ హైదర్ గోరి,అసోసియేషన్ సభ్యులు దయానంద్ గౌడ్, నాగేష్,గిరి, సాదిక్, బాలరాజ్ గౌడ్, నర్సింహా శర్మ, సత్యనారాయణ, మహేందర్, రాంచందర్, శ్రీశైలం,అన్వార్, అశోక్, m.రాంచందర్, రవి,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.