నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా 31.19 లక్షల మంది ఆశ్రయం లేని పేద ప్రజలకు ఇంటి పట్టాలు ఇచ్చింది.
ఈ నెల 27 నుంచి ఆ ఇంటి పట్టాలకు రిజిస్ట్రేషన్లు చేయనుంది. గ్రామ, వార్డు సచివాలయంలో ఈ ప్రక్రియ జరగనుంది.
ప్రభుత్వం తరుపున వీఆర్వో రిజిస్ట్రేషన్ చేస్తారు. వచ్చే నెల 9 లోపు ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తికానుంది. ఈ ప్రక్రియ సక్రమంగా సాగేలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ జిల్లా కలెక్టరేట్లలో ప్రభుత్వం కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయనుంది.