SAKSHITHA NEWS

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో విశాఖపట్నంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానుంది. 30 వేల నుంచి 35 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అనువైన భవనాల్ని గుర్తించాలని విశాఖ పట్నం జిల్లా కలెక్టర్ కి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ రాసింది.

ఆర్ధిక శాఖ చెప్పినట్లు అనువైన భవనాన్ని గుర్తించి అనంతరం తెలియజేస్తే తమ బృందం వచ్చి పరిశీలిస్తుందని ఆర్బీఐ తెలిపింది.

ఇది ఇలా ఉంటే గతంలో టీడీపీ ప్రభుత్వం అమరావతిలో ఆర్బీఐ కార్యాలయానికి మరియు నివాస సముదాయాల ఏర్పాటుకు 11 ఎకరాల భూమిని కేటాయించగా ఇప్పటి జగన్ ప్రభుత్వం విశాఖపట్నంలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.

WhatsApp Image 2024 02 20 at 12.59.35 PM

SAKSHITHA NEWS