Red notices issued for tax arrears: Mayor Sirisha, Commissioner Anupama
పన్ను బకాయిలకు రెడ్ నోటీసులు జారీ : మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ
సాక్షిత : తిరుపతి నగరపాలక సంస్థ పరిధిలో ఆస్తి పన్నులు కట్టకుండా ఉన్న మొండి బకాయిదారులకు రెడ్ నోటీసులు జారీ చేయాలని తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ ఆదేశాలు జారీచేసారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయం మేయర్ చాంబర్లో రెవెన్యూ సిబ్బందితో గురువారం నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ మాట్లాడుతూ సచివాలయం పరిధిలో రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ భవనాల వారీగా విభజించాలని, మొండి బకాయిలు దారులు పన్నులు చెల్లించకపోతే నగరపాలక సంస్థ అందిస్తున్న సదుపాయాలను తొలగించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
రెవెన్యూ అధికారులనుద్దెసించి మాట్లాడుతూ మీకు ఇచ్చిన టార్గెట్ ను పూర్తి చేసి, నూరు శాతం ఆస్తి పన్నులు రాబట్టాలని, ఆయా వార్డులు ద్వారా ఆస్తి పన్నులు వసూలు, నగరపాలక సంస్థ పరిధిలో సచివాలయాల వారిగా రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్ భవనాల వారిగా విభజించాలని, నగరంలో కొత్తగా కడుతున్న అపార్ట్ మెంట్లు, బిల్డింగులకు కొత్త పన్నులు వేయాలని, వాటిద్వారా ఆదాయము పెరుగుతాయని తెలియజేసినారు.
సచివాలయ సిబ్బందితో డిమాండ్ నోటీసులు ఇప్పించాలని, ఖాళీ జాగా స్థలాలకు కూడా పన్నులు వెయ్యాలన్నారు. నగర ప్రజలను ఉద్దేశించి మేయర్, కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఆస్తి పన్నులు, ట్రేడ్ లైసెన్స్, త్రాగునీరు పన్నులు, యూజీడీ పన్నులు కట్టాలని, నగరంలో ప్రతి ఒక్కరికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని పెండింగ్లో ఉన్న వాటిని పదిహేను రోజులు లోపల కట్టి నగరపాలక అభివృద్ధికి తోడ్పడాలన్నారు.
ఈ సమావేశంలో ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు లోకేష్ వర్మ, సేతు మాధవ్, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు రాజశేఖర్, మధుసూదన్ రెడ్డి, ప్రకాష్, సూరిబాబు,శంకరయ్య, నవిన్ కుమార్, జ్యోతిష్, శ్రీనువాసులు రెడ్డి, రామ్మోహన్ రెడ్డి, రెవెన్యూ సూపర్డెంట్ నాగేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.