Real journalists are those who fearlessly write the truth.
నిజాలను నిర్భయంగా రాసేవాళ్లే నిజమైన జర్నలిస్టులు.జర్నలిస్టులందరికి జాతీయ పత్రికా దినోత్సవం* టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి
సాక్షిత : ఒక దేశములో ప్రజాస్వామ్యము సక్రమముగా ఉందా లేదా అని తెలుసుకోవాలంటే పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు అని చాల మంది భావన.పత్రికలు కేవలం సమాచార సాధనాలు మాత్రమే కాదు. ఒకనాటి విజ్ఞాన వీచికలు… ఉద్యమ వాహకాలు.. చైతన్య దీపికలు.. ప్రజలకు అండగా నిలిచే ఆయుధాలని టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.జాతీయ పత్రికా దినోత్సవం మీడియా మిత్రులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు.
నిజాలను నిర్భయంగా రాసేవాళ్లే కాకుండా ఎల్లప్పుడూ ప్రజలకు మెరుగైన సమాచారాన్ని అందివ్వగలిగే ప్రతి ఒక్కరూ నిజమైన జర్నలిస్టులని అన్నారు.పత్రికల ఆధారంగానే స్వతంత్ర్య సమరం సాగిందని,లక్షలు,కోట్ల కొలదీ ప్రజలను నడిపించేది కేవలం మీడియాలో పనిచేస్తున్న నిఖార్సయిన జర్నలిస్టు మిత్రులని అన్నారు.
ఆనాడు.బ్రిటీష్ వారిని తరిమికొట్టి భారతదేశ ఔన్నత్యాన్ని నిలిపేందుకు దోహదపడిందని గుర్తు చేశారు.గాంధీ నుంచి అంబేద్కర్ వరకూ అందరూ పత్రికల్లో పనిచేశారన్నారు.పత్రికల కోసం పనిచేశారన్నారు.పత్రికా స్వతంత్ర్యకోసం నిలిచారని,స్వతంత్ర్యానంతరం కూడా రెండు మూడు దశాబ్దాల పాటు పత్రికలు తమ విశిష్టతను నిలపుకున్నాయని తెలిపారు.
ప్రజా సమూహంలో విస్తృత ప్రభావాన్ని చూపగలిగాయి,అలాంటి పత్రికలలో విధులను నిర్వహిస్తూ…
సమాజంలో ఆర్థిక, రాజకీయ, సామాజిక తదితర అన్ని వర్గాల అంశాలను నిష్పక్షపాతంగా సమన్వయం చేస్తూ.. మంచి,చెడులను ఎత్తి చూపి ఏ స్వార్ధం లేకుండా సమాజ శ్రేయస్సు కోరుకునే పాత్రికేయ మిత్రులకు మరొకసారి జాతీయ పత్రిక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు.