ఒక రాష్ట్ర ప్రభుత్వం ,
ఒక ముఖ్యమంత్రి మద్దతు..
కేంద్రం ప్రభుత్వం అండ,
కుటుంబ సభ్యులను నుండి బెదిరింపులు, ప్రాణహాని,
ఒక పార్టీ నాయుకులు , కార్యకర్తలు అంతా కలిసి చనిపోతే వ్యక్తి మీద వ్యక్తి గత ఆరోపణలు, వ్యక్తిగత హననం చేస్తున్నారు.. ఇంతమంది ఒకవైపు నుండి ఎదురుదాడి చేస్తున్నా కూడా వాళ్ళకి ఒక ఆడపిల్ల ఎదురెళ్ళింది.
డా. సునీతా రెడ్డి తన తండ్రిని హత్యచేసినోళ్ళకి శిక్షపడాలనీ కాదుగానీ తండ్రిని చంపింది ఎవరో ఈ ప్రపంచానికి తెలియాలనీ నాలుగు సంవత్సరాలుగా ఒంటరిగా పోరాటం చేస్తుంది. మరొకరు అయితే డబ్బుకి ఆశపడో, ఈ అధికారానికి భయపడో ఈ ఫాక్షన్కి బెదిరిపోయో కేసుని వాపసు తీసుకునేవారు . కానీ YS సునీతా రెడ్డి నన్ను చంపేసినా పర్వాలేదు గానీ నా కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు పోరాడుతాను అని ఒక ఆడపులిలా కేంద్ర ప్రభుత్వం అండదండలు మెండుగా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురునిలబడింది.
పదిమంది సంతానం ఉంటే ఏం ఉపయోగం, నలుగురు కొడుకులు ఉంటే ఏం ఉపయోగం, సునీతా రెడ్డి లాంటి ఒక కూతురు ఉంటే చాలదా, ఇదే కదా వివేకానంద రెడ్డి సంపాదించుకున్న బలం బలగం..!