SAKSHITHA NEWS

WhatsApp Image 2023 09 13 at 11.01.45

హైదరాబాద్ :
పుట్టుకతోనే విపరీతమైన గూనితోపాటు వెన్నెముకపై అసాధారణమైన పెరుగుదలతో ఇబ్బంది పడుతున్న ఛత్తీస్‌గఢ్‌ బాలిక (9)కు సికింద్రాబాద్‌ కిమ్స్‌ దవాఖాన వైద్యులు అరుదైన శస్త్రచికిత్సతో ఉపశమనం కల్పించారు. వైద్య పరిభాషలో ‘కోజెనిటల్‌ డోర్సల్‌ కైఫోసిస్‌’గా పిలిచే ఈ సమస్యను సుదీర్ఘ శస్త్రచికిత్సతో విజయవంతంగా పరిష్కరించారు.

వెన్నెముకలోని ఎముకలు అసంపూర్తిగా ఏర్పడటంతో ఈ సమస్య తలెత్తినట్టు వైద్య పరీక్షల్లో తేలిందని, ఎంతో సంక్లిష్టమైన ఈ సమస్యను సరిగ్గా పరిష్కరించకపోతే భవిష్యత్తులో ఆ బాలికకు పక్షవాతం వచ్చే ముప్పు ఉన్నదని వైద్యులు తెలిపారు.

ఈ నేపథ్యంలో కార్డియాలజిస్టులు, పల్మనాలజిస్ట్‌ల అభిప్రాయాలను తీసుకుని దాదాపు 6 గంటలపాటు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని వివరించారు. ఈ శస్త్రచికిత్సలో భాగంగా ఇంట్రా ఆపరేటివ్‌ న్యూరో మానిటరింగ్‌తోపాటు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించడం ద్వారా రోగి త్వరగా కోలుకోగలిగేలా చేసినట్టు తెలిపారు…


SAKSHITHA NEWS