Rapid development works in Lashkar, facilities for future needs
లష్కర్ లో ముమ్మరంగా అభివృద్ధి పనులు, భవిష్యత్తు అవసరాలకు అనువుగా సదుపాయాలు
ఉప సభాపతి శ్రీ తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడి
సాక్షితసికింద్రాబాద్ : అభివృద్ధి కార్యక్రమాల అమలు, సంక్షేమ కార్యకలాపాల నిర్వహణలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని నిత్యం అగ్ర స్థానంలో నిలిపేందుకు నిరంతరం శ్రమిస్తున్నామని, ఈ క్రమంలో భవిస్యత్తు అవసరాలను కూడా దృష్టిలో ప్రణాళికా బద్దంగా ఉంచుకొని వివిధ సదుపాయాలు కల్పిస్తున్నామని ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ వెల్లడించారు.
నామాలగుండు లో సికింద్రాబాద్ జీ హెచ్ ఎం సీ వార్డు కార్యాలయం నిర్మాణం పనులను పద్మారావు గౌడ్ ప్రారంభించారు. రూ. రెండు కోట్ల మేరకు నిధులతో దాదాపు 795 చదరపు గజాల స్థలంలో ముదంతస్తులతో ఈ కొత్త భవనాన్ని నిర్మించనున్నారు. డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతే శ్రీలత శోభన్ రెడ్డి, కార్పొరేటర్ కుమారి సామల హేమ, తెరాస యువ నేతలు కిషోర్ కుమార్, రామేశ్వర్ గౌడ్, జోనల్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ కమీషనర్ దశరద్ లతో పాటు అధికారులు, నేతలు పాల్గొన్న ఈ కార్యక్రమం లో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ కొత్త వార్డు కార్యలయం భవనాల నిర్మాణం పనులను ఏడాది కాలంలో పూర్తి చేయాలనీ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పరంగా ఒక్క ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ కూడా లేని లోటును తీర్చి సితాఫలమండీ ప్రభుత్వ స్కూల్ లో ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీ లను ప్రారంభించి స్థానికుల దశాబ్దాల కలను నేరవేర్చగాలిగామని తెలిపారు. రూ.29 కోట్ల ఖర్చుతో కొత్త భవనాల ఈ కొత్త భవనాల నిర్మాణం పనులను అతి త్వరలో ప్రారంభిస్తామని పద్మారావు గౌడ్ తెలిపారు. అదే విధంగా కుట్టి వెల్లోడి ప్రభుత్వ ఆసుపత్రి కొత్త భవనాలు రూ.11.60 కోట్లు మంజురయ్యయని, నిర్మాణం పనులను త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు.
ఇక మెట్టుగూడ నుంచి ఆలుగడ్డ బావి మీదుగా చిలకల్గుడా ప్రధాన రహదారిలో రైల్వే బ్రిడ్జి (RUB) నిర్మాణానికి రూ.30 కోట్లు, సితాఫలమండీ-తార్నాకల మధ్య మనికేశ్వరి నగర్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ వల్ల రెండు వైపులా రాకపోకలు సాగించే వారు నిత్యం ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని RUB నిర్మాణానికి రూ.20 కోట్లు మంజూరు చేయించామని తెలిపారు. కొత్త సంవత్సరం ‘లష్కరులో అభివృద్ధి పనులు చురుకుగా సాగే సంవత్సరం’ గా మారనుందని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.