Ranga Reddy district court lawyers separate in protest against attack on lawyer
న్యాయవాదిపై దాడి కి నిరసనగా రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం న్యాయవాదుల విదుల భైస్కరణ మరియు రాస్తారోకో నిర్వంచారు
*
సాక్షిత : రంగారెడ్డి జిల్లా న్యాయవాది నారపాక సురేందర్ పై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఎల్బీనగర్ లోని ర్యాలీ నిర్వహించిన అడ్వకేట్స్ సంఘం..*
ఓ కేసు విషయంలో నల్గొండ జిల్లాకు వెళ్లి కోర్టులో వాదించి రంగారెడ్డి జిల్లా కోర్టుకు వస్తున్న తరుణంలో అగాంతకుల ధ డి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు చేసినా కానీ పట్టించుకోవడంలేదని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గుర్రం సుధాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
*న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలంటూ న్యాయవాదుల సంఘం
అధ్యక్షులు గుర్రం సుధాకర్ రెడ్డి. , జనరల్ కార్యదర్శి పొన్నం దేవరరాజు గౌడ్ మరియు తెలంగాణ లీగల్ సెల్. కన్వీనర్ పులి గోవర్ధన్ రెడ్డి. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వడ్యారపు రవికుమార్ మరియు ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ (ఎ ఐ ఎల్ యు )
రంగారెడ్డి జిల్లా కమిటీ జనరల్ సెక్రటరీ శ్రీమతి మోతుకూరి వనజా. మరియు ఉపాధ్యక్షుడు. కందుకూరి నరసింహాచారి. మరియు సీనియర్ న్యాయవాదులు మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గోని అందరు న్యాయవాదులకి ప్రత్యేక రక్షణ చట్టం కావాలని డిమాండ్ చేసారు. అలాగే
20 రోజులలో సురేందర్ కు జరిగిన కేసు విషయంలో పరిష్కారం దొరకకపోతే తెలంగాణ సెక్రటరీ ముట్టడిస్తామంటూ డిమాండ్ చేశారు. మరియు
41(A) సి ఆర్ పి సి వల్ల న్యాయవాదులకు కేసులు కూడా రావడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే 41 సి ఆర్ పి ని రద్దు చేయాలంటూ న్యాయవాదుల సంఘం డిమాండ్ చేసారు.