పారిశుధ్య పనులను అకస్మిక తనిఖీలు..
విధులలో అలక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకుంటాం : మున్సిపల్ కమిషనర్ పతి శ్రీ హరిబాబు
చిలకలూరిపేట : పట్టణంలోని 8వ వార్డులో పారిశుధ్య పనులను కమిషనర్ పతి శ్రీ హరిబాబు ఉదయం 6 గంటలకు ఆకస్మికంగా పరిశీలించారు. కళా మందిర సెంటర్ , ఆర్యవైశ్య కళ్యాణ మండపం తదితర ప్రాంతాల్లో స్థానికులను సమస్యలను అడిగి తెలుసుకున్నారు.1,2,వ డివిజన్ ల పరిధిలోని వివిధ గార్బేజ్ ల వద్ధ చెత్త సేకరణ ఆలస్యం కాకుండా పారిశుధ్య పనులు సరి అయినా టైమ్ కు జరిగేలా చూసుకోవాలనికార్మికులకుఆదేశించారు,అక్కడి నుండి పట్టణంలోని వివిధ వార్డుల్లో జరుగుతున్న పారిశుధ్య పనులను ఆయన పరిశీలించారు.
అనంతరం,1వ డివిజన్ శానిటేషన్ కార్యాలయం వద్ద ఉన్న శానిటరి ఇన్‌స్పెక్టర్ రమణారావు, శానాటరీ మేస్త్రిలు , సచివాలయ సిబ్బంది కి ఆయన పలు సూచనలు చేశారు,పారిశుధ్య విధుల సమయంలో అలెక్ష్యంగా ఉన్న ,సరిగా విధులు నిర్వర్తించకున్న చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.