సాక్షిత : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా సనత్ నగర్ లోని వెల్ఫేర్ సెంటర్ గ్రౌండ్ లో వేలాది మంది ముస్లీం సోదరులు నిర్వహించిన సామూహిక ప్రార్ధనలలో మంత్రి పాల్గొన్నారు. ప్రార్ధనల అనంతరం ముస్లీం సోదరులను ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ సందర్భంగా నెల రోజుల పాటు ఎంతో నిష్ఠతో ఉపవాస దీక్షలు చేస్తారని తెలిపారు. రంజాన్ ను ఎంతో సంతోషంగా జరుపుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సనత్ నగర్ డివిజన్ BRS అధ్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, నాయకులు సరాఫ్ సంతోష్ ఖలీల్, రాజేష్, జమీర్ తదితరులు పాల్గొన్నారు.
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ అని రాష్ట్ర పశుసంవర్ధక,
Related Posts
20 వేల మందితో ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన వన సమారాధన.
SAKSHITHA NEWS 20 వేల మందితో ప్రభుత్వ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళన వన సమారాధన. కుల,మత, రాజకీయాలకు అతీతంగా ఆత్మీయ సమ్మేళనం. పాత్రికేయుల సమావేశంలో టీజీఇ జేఏసీ రాష్ట్ర సెక్రెటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు వెల్లడి. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో…
జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో కులగణనపై అవగాహన సదస్సు
SAKSHITHA NEWS జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో కులగణనపై అవగాహన సదస్సు సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ : ఈ నెల ఆరో తేదీ నుండి రాష్ట్రంలో నిర్వహించనున్న కులగణనపై జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో…