సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్;
స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు దివ్య ఖురాన్ పఠించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ తెలియజేశారు. నెత్తిన సాంప్రదాయ తెల్లని టోపీ ధరించిన విద్యార్థులు ఈద్-ఉల్-ఫితర్ వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించి తమ మిత్రులకు సేమ్యాలు, మిఠాయిలు పంచి ఆనందోత్సవాలు జరిపారు. సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహించిన రంజాన్ వేడుకలను ఉద్దేశించి పాఠశాల కరస్పాండెంట్ చింత నిప్పు కృష్ణ చైతన్య మాట్లాడుతూ రంజాన్ పర్వదినం అందరికీ మానవతా ధర్మాన్ని నేర్పుతున్నదని పేర్కొన్నారు. పేదలకు దానధర్మాలు చేసి ఆపదలో ఉన్న వారికి కొండంత అండగా నిలిచి భరోసా ఇవ్వాలన్న దివ్య సందేశాన్ని ఈద్-ఉల్-ఫితర్ మనకు వివరిస్తున్నదని చెప్పారు. 30 రోజులపాటు కఠోర దీక్షా దక్షతతో ఉపవాస దీక్షను ఆచరించడం ద్వారా సర్వకాలాలలో ఉత్తమ మానవులుగా జీవించాలని రంజాన్ పండుగ మనందరికీ సందేశాన్ని తెలియజేస్తున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ చింత నిప్పు సుకన్య, ప్రిన్సిపాల్ విజయ కుమారి, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు.