చిట్యాల (సాక్షిత ప్రతినిధి)
జనగామ లో ఈ నెల 29,30వ తేదీ లలో జరిగే తెలంగాణ రజక వృత్తి దారుల సంఘం రాష్ట్ర 3వ మహాసభలను జయప్రధం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు చెర్కు పెద్దులు కోరారు. చిట్యాల మండల కేంద్రంలో శనివారం నాడు సంఘం రాష్ట్ర మహాసభల గోడ పత్రికలు వివిధ ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వృత్తి దారుల వ్యతిరేక విధానాలపై ఉద్యమిస్తూనే ప్రభుత్వాలు ఇచ్చిన వాగ్దానాలు అమలు కోసం రాజీలేని పోరాటాలు సంఘం చేస్తున్నట్లు తెలిపారు.
రజక వృత్తి దారులందరికీ పది లక్షల రూపాయల రుణం ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. మహాసభల సందర్భంగా 29వ తేదీ న జరిపే మహా ప్రదర్శనకు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కెవిపియస్ రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్ట నగేష్, మాజీ జెడ్పీటీసీ మెంబరు పామనుగుల్ల అచ్చాలు, సిఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు నారబోయిన శ్రీనివాస్ లు, రజక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఐతరాజు యాదయ్య, జిల్లా నాయకులు ఐతరాజు నర్సింహ, అక్కనపల్లి నాగయ్య, రుద్రారపు పెద్దులు, నాయకులు నలపరాజు శేఖర్, కడగంచి నర్సింహ, ఏళ్ళ మారయ్య, తీగల క్రిష్ణయ్య తదితరులు పాల్గొన్నారు