Rajagopal Reddy lost the chance to vote..this is the reason
ఓటు వేసే అవకాశం కోల్పోయిన రాజగోపాల్ రెడ్డి..కారణం ఇదే..!
సాక్షిత మునుగోడు: మునుగోడు ఉప ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. పోలింగ్ ప్రారంభం అవ్వంగా అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా ఓటర్లు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.మొత్తం ఏడు మండలాల్లో 2.41 లక్షల మందికిపైగా ఓటు వేయనున్నారు.
ప్రధాన పార్టీలతో 47 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు.పారామిలటరీ బలగాలు,పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి రెడ్డి,టీఆర్ఎస్ అభ్యర్థి కుసుకుంట్ల ప్రభాకర్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇక్కడ ఓటు హక్కు లేదు.ఆయన ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తున్నారు.అయితే మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి ఎందుకు ఓటు హక్కులేదనే అంశం చర్చనీయాంశంగా మారింది.ఆయనకు నకిరేకల్ నియోజకవర్గంలోని నార్కట్పల్లి మండలం బ్రాహ్మణవెల్లెంలలో ఓటు హక్కు ఉంది.ఎన్నికల నిబంధనల ప్రకారం ఆయన అక్కడే ఓటు వేయాలి.
అక్కడి నుంచి మునుగోడు నియోజకవర్గానికి ఆయన ఓటు హక్కును మార్చుకోలేదు.దీంతో ఆయన తనకు తాను ఓటు వేసే అవకాశాన్ని కోల్పోయారు.ప్రతిష్టాత్మక ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డికి ఓటు హక్కు లేకపోవడం ఆసక్తికరంగా మారింది.ఓవైపు పోలింగ్ సాగుతుండగా మరోవైపు డబ్బుల పంపిణీ కలకలం రేపుతోంది.
చండూరులో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు సమాచారం తెలుసుకుని అక్కడికి వెళ్లగా డబ్బును వదిలేసి పారిపోయారు. 2 లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.నాంపల్లి మండలం మల్లాపూర్ రాజపల్లి కారులో రూ.`10 లక్షల నగదు పట్టుబడింది. టీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ పంచుతున్నారంటూ బీజేపీ నాయకులు వాహనాన్ని అడ్డుకున్నారు.ఉదయం 11 గంటల వరకు 25.80 శాతం పోలింగ్ నమోదైంది.