ఎవరెన్ని పార్టీలు మారిన.. ఎన్ని పార్టీలు ఏకమైన తెలంగాణలో కన్న తల్లిలాంటి పార్టీ బిఆర్ఎస్ పార్టీ గెలుపు ఖాయమని యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ అన్నారు. వచ్చే ఎన్నికలలో శేరిలింగంపల్లి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని యువనేత ధీమా వ్యక్తం చేశారు. అభ్యర్థుల ప్రకటన, పార్టీ మ్యానిఫెస్టో విషయాలలో సీఎం కేసీఆర్ ఎంతో స్పష్టంగా ఉన్నారని యువనేత అన్నారు. మ్యానిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్ బీమా పేరుతో కొత్త స్కీమ్ అమలు చేసి రూ.5 లక్షల చొప్పున కేసీఆర్ బీమా, రేషన్ కార్డుదారులందరికీ సన్నబియ్యం, ఆసరా పింఛన్ కు దశల వారీగా నెలకు రూ.5 వేలకు పెంపు, వికలాంగుల పెన్షన్ రూ.6వేల వరుకూ పెంపు వంటి పలు కీలక హామీలు మరియు దళిత బంధు, రైతు బంధు కొనసాగించడం, మైనార్టీల సంక్షేమానికి బడ్జెట్ పెంచడం, మైనార్టీలకు జూ.కాలేజీలను డిగ్రీ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేయడం వంటి నిర్ణయాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. కెసిఆర్ కేటీఆర్ ఆశీస్సులతో మరియు శేరిలింగంపల్లిలో 9 వేల కోట్ల రూపాయల అభివృద్ధితో నియోజకవర్గ ప్రజలు మా ఎమ్మెల్యే గాంధీగారిని మూడోసారి కూడా భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని, హ్యాట్రిక్ ఎమ్మెల్యే గా గాంధీ అన్న విజయం ఖాయం అని అన్నారు.
తెలంగాణలో బీఆర్ఎస్ జెండా ఎగరడం కాయంగాంధీ అన్న గెలుపు తధ్యం.
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…