పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలి – 124 డివిజన్ మహిళలు నిరసన
సాక్షిత : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పెరిగిన గ్యాస్ సీలిండర్ ధరలను నిరసిస్తూ.. చేవెళ్ల పార్లమెంటు సభ్యులు డాక్టర్ జి. రంజిత్ రెడ్డి మరియు శేర్లింగంపల్లి శాసనసభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ తో కలిసి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండ గుడ్ విల్ హోటల్ చౌరస్తా వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు మరియు మహిళలు రోడ్డు మీద కట్టెల పొయ్య పెట్టి చాయ్ కాచి అందించారు.
గ్యాస్ సిలిండర్ ప్లకార్డులు పట్టుకుని మోడీ డౌన్ డౌన్ నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం పాడి కట్టి మోడీ చిత్రపటాన్ని దహనం చేశారు. ఈ సందర్భంగా ఎం.పి రంజిత్ రెడ్డి మరియు ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ మహిళా దినోత్సవం జరుపుకోవడానికి మహిళలందరు సంసిద్ధమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలు పెంచి మహిళలను రోడ్ల మీదకు తీసుకువచ్చిందని అన్నారు. మహిళలకు మంచి చేయని ఏ ప్రభుత్వం కూడా మనుగడలో ఉండదని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలను వెంటనే గుర్తుంచి సిలిండర్ ధరలు తగ్గుంచాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, పాండు గౌడ్, జిల్లా గణేష్, చిన్నోళ్ల శ్రీనివాస్, కాశినాథ్ యాదవ్, రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, వెంకట్ నాయక్, షౌకత్ అలీ మున్నా, కృష్ణారావు, వెంకటేష్ గౌడ్, జగదీష్, వెంకటేష్, కైసర్, జగదీష్, షకీల్ మున్నా, అగ్రవాసు, బాలస్వామి, శామ్యూల్, ముజీబ్, రామకృష్ణ బాబాయ్, చంద్రశేఖర్ రెడ్డి, వాలి నాగేశ్వరరావు, అశోక్, సత్యనారాయణ, యాదగిరి, మహేష్, కూర్మయ్య, నరసింహులు,
సిద్దయ్య, కరుణాకర్, అలీ, కృపాకర్, వెంకటేష్, సదానంద్ గౌడ్, సాయిగౌడ్, సతీష్, కటిక రవి, అర్వరవి, చాణిక్య, రాందాస్ గౌడ్, జీవన్ రెడ్డి, ఆదర్శ్, బాలరాజు, ఇంతియాజ్, రాజు, మహిళా నాయకురాళ్లు రాజ్యలక్ష్మి, మధులత, శిరీష సత్తుర్, స్వరూపారాణి, మంజులా, షేక్ బీబీ, లక్ష్మమ్మ, రేణుక, సురేఖ, లావణ్య, స్వరూపా, స్వప్న, వరలక్ష్మి, పద్మ, సౌందర్య, కృష్ణవేణి, శశికళ, నిర్మలమ్మ, నశ్రీన్ బేగం, లలిత కుమారి, శోభారాణి, వనజ, సంతోషమ్మ, లక్ష్మీ, దుర్గ తదితరులు పాల్గొన్నారు.