
రైల్వే జీఎం కలిసిన ఎమ్మెల్యేలు,ఎంపీ…
రైల్వే రోడ్డు విస్తరణ,కాజీపేట బస్ స్టాండ్ ఏర్పాటుకు కృషి చేయాలని విజ్ఞప్తి…
హైదరాబాద్ సికింద్రాబాద్ రైల్వే భవన్ లో సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ జీఎం అరుణ్ కుమార్ జైన్ ని మర్యాదపూర్వకంగా కలసిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య,వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి ,స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ,శాసన మండలి సభ్యులు బస్వరాజు సారయ్య …
ఖాజీపేట రైల్వే రోడ్డు విస్తరణ,నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే కాజీపేట మీదుగా వెళ్లాల్సి ఉంటుందని ప్రజా రవాణా దృష్ట ప్రజలు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.కాజీపేట ప్రధాన రహదారి వెంట ఉన్న రైల్వే స్థలాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కి కేటాయిస్తే రాష్ట్ర ప్రభుత్వం నూతన బస్ స్టేషన్ నిర్మాణానికి సిద్ధంగా ఉందని తెలియాజేశారు.
జీఎం అరుణ్ కుమార్ జైన్ గారు సానుకూలంగా స్పందించి వీలైనంత త్వరగా అభ్యర్థనను ఆమోదించి చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app