SAKSHITHA NEWS

ర్యాగింగ్ చేయడం నేరం.

  • – – ర్యాగింగ్ లాంటి అసాంఘిక చర్యకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవు.
  • – -కళాశాల యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను గమనించాలి
  • – – జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారు

విద్యార్థులు ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఇది అత్యంత అమానుష చర్యని, తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని ఇబ్బందులకు గురి చేయడం మంచి విద్యార్ధి లక్ష్యం కాదు అని తెలిపినారు.

ర్యాగింగ్ చేయడం నేరమని, ఎవరైనా ర్యాగింగ్‌కు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది హెచ్చరించారు. విద్యార్థులు సీనియర్స్, జూనియర్స్ అనేది లేకుండా స్నేహపూర్వకంగా కలిసి మెలిసి విద్యనభ్యసించాలని సూచించారు. ర్యాగింగ్ లాంటి కేసుల్లో ఇరుకుంటే వారి బంగారు భవిష్యత్తు కోల్పోతారు, వ్యసనాలకు బానిసై విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. సరదాలకు వెళ్ళి కష్టాలను కొని తెచ్చుకోవద్దని, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. సీనియర్లు ఆదేశించినప్పటికీ, ఫ్రెషర్లు తమ ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేయడం మానుకోవాలి, విద్య సంస్థల యజమానులకు పిర్యాదు చేయాలని అన్నారు.

ర్యాగింగ్, ఈవ్ టీజింగ్ చేస్తూ దోషులుగా నిలవద్దని కోరారు. ర్యాగింగ్ కు పాల్పడే వారి వివరాలను డయల్ 100 కు తెలియజేసి పోలీసు సహాయం పొందవచ్చు అన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభమైందని అన్ని విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సులు నిర్వహించాలని, యాంటీ ర్యాగింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను, సిబ్బందిని ఆదేశించడం జరిగినదని తెలిపినారు. యాజమాన్యాలు విద్యార్థుల అలవాట్లను, నడవడికను గమనించాలని తెలిపినారు. ర్యాగింగ్ చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవు అన్నారు.


SAKSHITHA NEWS