SAKSHITHA NEWS

చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం

పుత్తూరు చెన్నై జాతీయ రహదారులు జరుగు రోడ్డు ప్రమాదంలో అరికట్టడంలో నిర్లక్ష్యం వహిస్తున్న ఎన్ హెచ్ ఐ వై అధికారులు మొండి వైఖరి నశించాలి
పుత్తూరు చెన్నై ఫోర్ లైన్ రోడ్లను వేయాలి
రోడ్డు మరమ్మత్తుల పేరుతో ప్రమాద సూచికలను ఏర్పాటు చేయడంలో నిర్లక్ష్యం వలన అనేక తల్లిదండ్రులకు కడుపుకోత
ఇప్పటికైనా జాతీయ రహదారి అధికారులు వైట్ లైన్ వేసి ప్రమాద సూచికలను ఏర్పాటు చెయ్యాలి – – – – – – – – ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కోదండయ్య ఏఐటియుసి నగిరి పట్టణ నాయకులు భాష రూప్ కుమార్ డిమాండ్
సుమారు నెల క్రితం జాతీయ రహదారుల దారులు మరమ్మత్తులు పేరుతో రోడ్లు వేయడం జరిగింది రోడ్డు వేసిన తర్వాత అధికారులు రోడ్లు పైన వైట్ మార్కింగ్, ప్రమాద సూచిక బోర్డులను డార్బిన్ ప్లేర్ (వైబ్రేటర్ లైన్లను) ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలి కానీ అధికారులు స్పందించలేదు, అధికారుల నిర్లక్ష్యం 20 మంది ప్రాణాలు పోగొట్టుకోవడం జరిగింది, అతివేగం ఈ ప్రమాదాలకు కారణం నా అధికారులు వెంటనే ప్రమాదాలను నివారించటానికి చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నేషనల్ హైవే జాతీయ రహదారుల కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించకపోతే జాతీయ రహదారిని దిగ్బంధిస్తామని హెచ్చరించారు, అనంతరం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జాతీయ రహదారుల అధికారులతో ఏఐటీయూసీ నాయకులు ఫోన్లో మాట్లాడడం జరిగింది, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరించాలని లేని పక్షంలో హైవే తిక్పందిస్తామని చెప్పడం జరిగింది. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ నాయకులు భాష రూప్ కుమార్ మురళి విజయ్ కుమార్ శేఖర్ మనీ బాబు అలీ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS