ఇల్లంతకుంట మండలంలో కాంగ్రెస్ అధ్యక్షుడు గూడపు సారంగపాణి ఐకెపి సెంటర్ ద్వారా కొనుగోలు,,,,,,
ఇల్లంతకుంట మండల కేంద్రంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గూడపు సారంగపాణి గారు మాట్లాడుతూ ఐకెపి సెంటర్ల ద్వారా సహకార సంఘాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులకు రెండు మాసాలు అవుతున్న రైతులకు డబ్బులు వారి ఖాతాలో వేయకపోవడం మరియు ఐకెపి సెంటర్లో తూకాల్లో మోసాలు చేసి అమ్ముకున్న ధాన్యానికి వెంటనే రైతుల ఖాతాలో డబ్బులు వేయాలని అకాల వర్షం పడినందువలన యాసంగి పంటకు వరి, మొక్కజొన్న, మిర్చి, నేలపాలై పంట నష్టం జరిగింది ప్రభుత్వ అధికారులు పర్యవేక్షణ చేసి పంట నష్టాన్ని గుర్తించినారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు మరియు రాష్ట్ర మంత్రులు, పర్యవేషించి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి ఇప్పటివరకు ఇవ్వడం లేకపోవడం పట్ల రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేసినట్లుగా భావిస్తున్నాము ముసలి కన్నీరు కాస్తున్న ఈ బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వాని గద్దె దింపే వరకు రైతాంగం పట్ల కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని రైతులకు డబ్బులు వెంటనే వారి వారి ఖాతాలో వేయని ఎడల కాంగ్రెస్ పార్టీ పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము ఈ కార్యక్రమంలో జమ్మికుంట పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పూదరి శివకుమార్ గౌడ్, తాడం దిలీప్ కుమార్, తిరుపతి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు..