Puppala Srinivasa Rao, who was seriously injured in a road accident, died
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పుప్పాల శ్రీనివాసరావు మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి జోగి రమేష్ .
బాపట్ల జిల్లా వేమూరు మండలం జంపని గ్రామం వద్ద రెండు రోజుల క్రితం పెడన నియోజకవర్గం, కృత్తివెన్ను మండలం నీలిపూడి గ్రామానికి చెందిన అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణిస్తున్న టాటా ఏస్ బోల్తాపడి నలుగురు మృతి చెందిన విషయం మీకు తెలిసిందే.
దురదృష్టవశాత్తు క్షతగాత్రుల్లో ఒకరైన పుప్పాల శ్రీనివాసరావు అనే భక్తుడు చికిత్స పొందుతూ మృతి చెందారు.
జయహో బీసీ మహాసభలో పాల్గొన్న మంత్రి జోగి రమేష్ ఈ దుర్వార్త తెలుసుకొని తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
విషయం తెలిసిన వెంటనే మంత్రి జోగి రమేష్ ఫోన్ ద్వారా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలపడమే కాకుండా వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
మృతి చెందిన పుప్పాల శ్రీనివాసరావు కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి జోగి రమేష్ హుటాహుటిన ముఖ్యమంత్రి తో మాట్లాడి మృతులకు ఐదు లక్షల ఎక్స్ గ్రేషియా ఇప్పించడమే కాకుండా క్షతగాత్రులకు అత్యంత అధునాతనమైన వైద్య సహాయం అందించడానికి అధునాతన హాస్పిటల్స్ లో చేర్పించిన విషయం మీకు తెలిసిందే.
అయినప్పటికీ తీవ్ర గాయాలు కావడం వల్ల అనుకోని విధంగా పుప్పాల శ్రీనివాసరావు మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపారు.
పుప్పాల శ్రీనివాసరావు మరణ వార్త తెలుసుకొని మంత్రి శ్రీ జోగి రమేష్ తల్లడిల్లిపోయారు.
జయహో మహాసభ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల వెంటనే వారి కార్యాలయ సిబ్బందిని ఆసుపత్రికి పంపించి, పోస్టుమార్టం చేసే వరకూ దగ్గరుండి భౌతిక దేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించే వరకూ అన్ని కార్యక్రమాలు దగ్గరుండి చూడాలని మంత్రి జోగి రమేష్ వారి సిబ్బందిని ఆదేశించారు.
అలాగే ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే వారి కుటుంబ సభ్యులను కలసి నేరుగా మాట్లాడటమే కాకుండా ప్రభుత్వం తరఫు నుంచి మరియు తన వైపు నుంచి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.