SAKSHITHA NEWS

మృతిని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన పుల్ల శ్రీనివాస్

కమలాపూర్ సాక్షిత న్యూస్ ( అక్టోబర్ 7 )

కమలాపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనిలో నివాసం ఉంటున్న ఎల్తురి పోశయ్య అనారోగ్యంతో మరణించాడు దహన సంస్కారాల నిమిత్తం మృతని కుటుంబానికి ఆసరాగా ఐదు వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసిన తెలంగాణ రాజ్యాధికార ఐక్య సమితి అధ్యక్షులు పుల్ల శ్రీనివాస్. ఇటీవలే 20 రోజుల క్రితమే తన భార్య కూడా మరణించడం తో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఎల్తూరి పోశయ్య నిరుపేద కుటుంబం అవడంతో వారి కుటుంబ సభ్యులు ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న సమయంలో విషయం తెలుసుకున్న పుల్ల శ్రీనివాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. తమ కాలనీ లో ఎవరు చనిపోయిన తన వంతు గా ఆర్థిక సహాయం అందించడానికి తప్పకుండా తాను అందుబాటులో ఉంటానని అయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘ ప్రధాన కార్యదర్శి శనిగరపు పవన్ ,ఉపాధ్యక్షులు ఓస్కుల సునీల్, కొయ్యడ సునీల్ , , మాట్ల శ్రీధర్, పుల్ల శ్రీకాంత్, జన్ను రమేష్, ఎల్తూరి రవీందర్ , ఎల్తూరి కుమార్, దుప్పటి సురేష్,పుల్ల మొగిలి మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS