అయోధ్యలో బాల రాముని విగ్రహ ప్రతిష్ట రోజున పులిపుట్టి గ్రామంలో భారతీ ఇంటర్నేషనల్ స్కూల్ చిన్నారుల రామ నామ సంకీర్తనలతో మార్మోగిపోయిన శ్రీరామ గిరి క్షేత్రం
మన్యం జిల్లాలో సీతంపేట మండలంలో పులిపుట్టి గ్రామంలో శ్రీ రామగిరి క్షేత్రంలో భారతీ ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థి విద్యార్థులు కాషాయ జెండాలతో రామ నామ సంకీర్తనలతో కన్నె ధార కొండ మీదకు పాదయాత్ర చేస్తూ శ్రీ రాముని దర్శనం చేసుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
500 సంవత్సరాల హిందువుల చిరకాల కోరిక ఐన అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట సుముహూర్త సందర్భంగా పులిపుట్టి గ్రామంలో ఉన్న శ్రీ భారతి ఇంటర్నేషనల్ స్కూల్ లో ప్రిన్సిపాల్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులు మరియు ఉపాధ్యాయ బృందం అంగరంగ వైభవంగా కాషాయ జెండాలతో పచ్చ తోరణాలు, స ముగ్గులతో, సాంస్కృతిక కార్యక్రమాలు స్కూల్ ఆవరణలో నిర్వహించి ఉత్సవాలు చేసుకున్నారు.
ఈ కార్యక్రమం వాల్మీకి వనవాసి శ్రేయో సంస్థ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ నవీన్ కుమార్ మరియు ట్రస్ట్ సభ్యులు పెంటయ్య మాస్టారు, గేదెల ప్రసాద్ లతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు పాల్గొన్నారు.