సంక్షేమ పథకాలపై ప్రజాచైతన్యం కోసమే “గడప గడపకు మన ప్రభుత్వం” _ మంత్రి ఆర్.కే. రోజా*
సాక్షిత : సంక్షేమ పథకాలపై ప్రజాచైతన్యం కోసమే ప్రతి గ్రామంలో “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమాన్ని నిర్వహిస్తునట్లు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల, క్రీడా శాఖామంత్రి శ్రీమతి *ఆర్.కె. రోజా * తెలిపారు. నగరి మండలం నంబాకం సచివాలయం పరిధిలోని దేసూరు అగరమ్, దేసూరుదళితవాడ, ఎస్.టి.కాలనీలలో మంత్రి ఆర్.కె. రోజా గడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్నారు. దేసూరు అగరం లోని ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను గురించి లబ్ధిదారులకు వివరించారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి అమలుచేస్తున్న సంక్షేమ పథకాల వలన కలుగుతున్న లబ్దిని ప్రజలే స్వయంగా మంత్రి కి చెప్పడం విశేషం.
వైస్సార్సీపీ ప్రభుత్వంలో పారదర్శకంగా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాల గురించి మంత్రి శ్రీమతి ఆర్.కె. రోజా వివరించారు.
ఈ కార్యక్రమం లో నగరి గ్రామీణ మండల ఎంపిపి, వైస్ ఎంపిపి, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు, డైరెక్టర్లు, చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, మండల అదికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.