SAKSHITHA NEWS

WhatsApp Image 2023 08 07 at 5.40.44 PM

కృష్ణాజిల్లా, మచిలీపట్నం.

పత్రికా ప్రకటన

➡️ ప్రజా సమస్యల పరిష్కార వేదిక “స్పందన” – జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపీఎస్.

➡️ ప్రజలకు మరింత చేరువగా వారి సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని, చట్టపరిధిలో విచారణ జరిపి వాటికి అనుగుణంగా త్వరితగతిన పరిష్కారం అందించడం జరుగుతుందని హామీ ఇచ్చారు.

➡️ బాధితులకు ఎల్లవేళలా కృష్ణా జిల్లా పోలీస్ శాఖ అండగా ఉంటుంది.

➡️ సుదూర ప్రాంతం నుండి అర్జీలు సమర్పించడానికి వచ్చే బాధితులను దృష్టిలో ఉంచుకొని అర్జీదారుల కొరకు స్వయంగా ఎస్పీ ద్వారా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజల యొక్క సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలనే సదుద్దేశంతో తలపెట్టిన స్పందన కార్యక్రమాన్ని జిల్లా పోలీస్ కార్యాలయం నందు జిల్లా ఎస్పీ శ్రీ పి. జాషువా ఐపీఎస్ నిర్వహించి ఫిర్యాదుదారులు వద్ద నుండి ఫిర్యాదులు స్వీకరించారు. సోమవారం స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేయడానికి వచ్చే ఫిర్యాదుదారులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా పటిష్ట చర్యలు తీసుకోవడం జరిగింది. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులకు తమ చేయి అందించి నడిపించుకొని తీసుకు వచ్చారు. అదేవిధంగా సుదూర ప్రాంతం నుండి అర్జీలు సమర్పించడానికి వచ్చే బాధితులను దృష్టిలో ఉంచుకొని అర్జీదారుల కొరకు స్వయంగా ఎస్పీ గారి ద్వారా మధ్యాహ్నం భోజనం ఏర్పాటు కూడా చేయడం జరిగింది.

పోలీస్ కార్యాలయానికి వివిధ సమస్యల పరిష్కారం నిమిత్తం వచ్చిన ఫిర్యాదు దారుల నుండి SP అర్జీలను స్వీకరించి, వారితో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్య యొక్క పూర్వాపరాలను తెలుసుకుని, సంబంధిత పోలీస్ అధికారులను సత్వరంగా పరిష్కరించ వలసిందిగా తగు ఆదేశాలను జారీ చేసారు. వాటి యొక్క తీవ్రత ఆధారంగా వెంటనే విచారణ జరిపించి 24 గంటల్లో పరిష్కారం చేసేలా చర్యలు చేపట్టామని ఎస్పీ తెలియజేశారు.


SAKSHITHA NEWS