పల్లంగూడ & యాప గ్రామపంచాయతి లలో ప్రజా పాలన కార్యక్రమం లో పాల్గొన్న కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్
ప్రజా పాలన కార్యక్రమాన్ని బెల్లంపల్లి MLA గడ్డం వినోద్ ఆదేశాల మేరకు
*కాసిపేట మండల అధ్యక్షులు రత్నం ప్రదీప్ పల్లంగూడ &యాప గ్రామపంచాయతీ లలో ప్రజా పాలన కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.
అనంతరం రత్నం ప్రదీప్
మాట్లాడుతూ..
తెలంగాణ రాష్ట్రంలో
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో బెల్లంపల్లి నియోజకవర్గం అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గడ్డం వినోద్ సారథ్యంలో
మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం అర్హులైన ప్రతీ ఒక్కరి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది.
ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజా ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమయజ్ఞంలో భాగస్వాములుకావాలని కోరుకుంటున్నాము అన్నారు
ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ గంగారాం ఎంపీడీఓ అలీ MRO భోజన్న కాంగ్రెస్ మండల నాయకులు వివిధ శాఖల ఆఫీసర్స్ అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు..