సమాచార హక్కు రక్షణ చట్టం -2005జిల్లా అధ్యక్షుడిగా కుశనపెల్లి రాజేందర్
సాక్షిత ధర్మపురి ప్రతీనిది:-
జగిత్యాల జిల్లా సమాచార హక్కు రక్షణ చట్టం -2005 జగిత్యాల జిల్లా అధ్యక్షుడుగా కుశనపెల్లి రాజేందర్ ను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొంగర్ల కమలాకర్ పేర్కొన్నారు.ఈ మేరకు నియమకపు పత్రాన్ని ఆయన రాజేందర్ కు అందజేశారు. అనంతరం కమలాకర్ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రభుత్వేతర కార్యాలయాల్లో జరిగే అక్రమాలను సమాచార హక్కు చట్టం ద్వారా వెలికి తీస్తూ సమాజ అభివృద్ధికి తోడ్పాడలన్నారు. విద్యార్థి, ప్రజా ఉద్యమాల్లో అనేక సమస్యలపై పోరాటాలు నిర్వహించి విజయాలు సాధించిన కుశనపెల్లి రాజేందర్ సమాచార హక్కు రక్షణ చట్టం-2005 లోనూ రాణించాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ నియామకం నేటి నుండే అమలులోకి వస్తుందన్నారు.