SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 21 at 6.38.23 PM

మణిపూర్ నిందితులను కఠినంగా శిక్షించాలి

మహిళల అర్ధ నగ్న ర్యాలీ పై మోడీ మోనం

జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య

సభ్య సమాజం తల దించుకునేలా బిజెపి విధానాలు

నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్

జిల్లా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దహనం

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బిజెపి ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ కరువైందని మణిపూర్ సంఘటన ఇందుకు నిదర్శనమని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య విమర్శించారు. మణిపూర్ లో జరిగిన సంఘటనకు నిరసనగాజిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనం వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మోడీ దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మణిపూర్ లో ఇద్దరు మహిళలను అర్ధ నగ్నంగా ఊరేగించి వారిపై అత్యాచారం చేసిన సంఘటన యావత్తు దేశాన్ని కలిచి వేసిందని కానీ మోడీ మాత్రం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో రోజులుగా జరుగుతున్న అల్లర్లను కేంద్ర ప్రభుత్వం అదుపు చేసి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదని మోడీ ప్రభుత్వ చేతకాని తనానికి ఈ ఘటన నిలువుటద్దం అని హితవు పలికారు. మణిపూర్ లో పర్యటించిన కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా ఇంపాల్లో చర్చి భవనాలను తగల బెట్టినా తప్పు బట్టకపోవడం పట్ల ఈ అల్లర్లకు బిజెపి యే ఉసిగొల్పిందనేది స్పష్టం అవుతుందని అన్నారు . వెంటనే మణిపూర్ ముఖ్యమంత్రి ని బర్తరఫ్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ముఖ్య అతిథులుగా పాల్గొన్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ మాట్లాడుతూ..బిజెపి విధానాలు సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉన్నాయని అన్నారు. మణిపూర్ లో జరుగుతున్న క్రైస్తవ వ్యతిరేక హింసకు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ అధికారులు మద్దతు ఇస్తున్నారని స్వయంగా మిజోరం బీజీపీ ఉపాధ్యక్షుడే తన పదవికి రాజీనామా చేశాడని అన్నారు. బిజెపి కులం, పేరుతో మతం పేరుతో అల్లర్లు సృష్టిస్తుందనడానికి మణిపూర్ సంఘటన ఉదహరణ అని అన్నారు. ఇద్దరు మహిళలను విచక్షణా రహితంగా అర్ధ నగ్నంగా ఊరేగించి వారిపై అత్యాచారం చేసిన ఘటన జరిగి 75 రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని అన్నారు. పార్లమెంట్ లో సైతం మోడీ ఆ ఘటన పై స్పందించక పోవడం సిగ్గు చేటని అన్నారు. వెంటనే మణిపూర్ ఘటనపై విచారణ చేపట్టి మణిపూర్ ముఖ్యమంత్రి ని బర్తరఫ్ చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంజీవ రెడ్డి భవనం నుండి పాత బస్టాండ్ వరకూ ర్యాలీ నిర్వహించి మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు యడ్లపల్లి సంతోష్, కొంగర జ్యోతిర్మై, జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు దామ స్వరూప,జిల్లా ఉపాధ్యక్షురాలు దివ్య, జిల్లా మహిళా సెక్రటరీ భానోత్ వినోద, సెక్రటరీ ఏలూరి రజినీ, కొత్తపల్లి పుష్ప, స్వరూప, లక్ష్మి, రేవతి, సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఏలూరి రవి,ఎస్టీ సెల్ నగర అధ్యక్షులు శంకర్, సేవాదళ్ జిల్లా నగర అధ్యక్షుడు గౌస్, నగర మైనార్టీ సెల్ అధ్యక్షులు అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS