problems of Gram Panchayat workers in Vinavanka Mandal are not resolved
కరీంనగర్ జిల్లా వినవంక మండలంలోని గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం …
యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్
ఆదివారం రోజున వీణవంక మండల కేంద్రంలో గ్రామపంచాయతీ ఏం ప్లేస్ అండ్ వర్కర్స్ యూనియన్ వీణవంక మండల కమిటీ సమావేశం కదం కిషన్‌రావు అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొప్పుల శంకర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని, రాష్ట్రంలో అన్ని రంగాల కార్మికులకు వేతనాలు పెంచి గ్రామపంచాయతీ కార్మికులకు మాత్రం వేతనాలు పెంచలేదని, ప్రభుత్వం ప్రకటించిన ఎక్సైడ్ ఇన్సూరెన్స్ కు అతీగతి లేదని, ఉద్యోగ భద్రత లేదని, రానున్న రోజుల్లో ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కోసం కార్మిక వర్గం ఐక్యం చేసి ప్రభుత్వంపై పోరాడుతామని తెలిపారు.
దానిలో భాగంగానే నిర్మాణ పరంగా బలోపేతం చేసేందుకు అక్టోబర్ 9వ తేదీన కరీంనగర్ జిల్లా నాలుగో మహాసభలు నిర్వహించనున్నట్లు ఈ మహాసభల కి రాష్ట్ర కార్యదర్శి చాగంటి వెంకట హాజరవుతారని కార్మికులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు రాచర్ల మల్లేశం, యూనియన్ మండల అధ్యక్షులు మిట్టపల్లి సదానందం, ప్రధాన కార్యదర్శి మహంకాళి కొమురయ్య, చంద్రయ్య, కొమురయ్య, కర్రే లక్ష్మయ్య, పొన్నాల రాజయ్య, గాజుల సారయ్య, ఓదెలు, తదితరులు పాల్గొన్నారు.