ప్రకాశం జిల్లా
పెద్ద దోర్నాల్లోని ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన (ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్) పల్లె పల్లెలో వైద్య సేవలు అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నేడు లాంఛనంగా ప్రారంభించడంతో ఈ కార్యక్రమాన్ని చింతల వైద్యురాలు సాయి ప్రశాంతి అధ్యక్షతన పెద్ద దోర్నాల లోని ఉప ఆరోగ్య కేంద్రం నందు మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక, మండల పరిషత్ అధ్యక్షురాలు గుమ్మ పద్మజా ఎల్లేష్, వైస్ ఎంపీపీ దర్శనం నాగయ్య, ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు, మేజర్ పంచాయతీ సర్పంచ్ చిత్తూరు హారిక మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఎక్కడో మారుమూల ప్రాంతమైన పెద్దదోర్నాల మండలంలో పల్లె పల్లెకు వైద్య సేవలు అందించడంలో భాగంగా ప్రభుత్వ వైద్యులు నేరుగా తమ ఇంటికి వచ్చి వారి వారి యొక్క శరీర రుగ్మతల గురించి పరీక్షలు జరిపి వారికి అవసరమైన వైద్య సేవలను అందించటం ఎంతో అభినందనీయమన్నారు, అదేవిధంగా స్త్రీలు తమ శారీరక సమస్యలు ఇతరులతో చెప్పుకోవడానికి కొంచెం బిడియంగా బాధపడుతూ ఉంటారు, అలాంటి వారికి స్త్రీల వ్యాధి నిపుణులు నేరుగా పల్లె పల్లెలో వారి ఇంటికి వెళ్లి వారి సమస్యలకు పరిష్కారం చూపించే దిశగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ లో ముఖ్యమైనదిగా సర్పంచ్ చిత్తూరు హారిక తెలియజేశారు 104 వాహనాన్ని రిబ్బన్ కత్తిరించి పల్లె పల్లెకు వైద్యంలో భాగంగా నేడు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలోప్రభుత్వ వైద్యులు శంకర్ రెడ్డి,సాయి ప్రశాంతి,MLHP లు, గ్రామ సచివాలయ పంచాయతీ కార్యదర్శులు, కృపాచారి బ్రహ్మచారి, వసుంధర దేవి, మోహన్ రావు, వైయస్సార్ కెపి ఎపిఎం, పోలయ్య,ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు, తదితరులు పాల్గొన్నారు.