SAKSHITHA NEWS

ప్రజల భాగస్వామంతోనే డెంగ్యూ నివారణ సాధ్యం

వృధా నీటి నిర్మూలన ద్వారా దోమలను నివారించవచ్చని, ప్రజల భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధి నివారణ సాధ్యపడుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ అభిప్రాయపడ్డారు.జాతీయ డెంగ్యూ దినోత్సవం కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ ర్యాలీ కార్యక్రమం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయ ప్రాంగణంలో మంగళవారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొని పచ్చజెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా డెంగ్యూ వచ్చేందుకు గల కారణాలు తెలుసుకొని, వాటి నివారణకు చేపట్టవలసిన గురించి అవగాహన పెంచుకోవడం దీని ముఖ్యఉద్దేశ్యమని అన్నారు. డెంగ్యూ ఈడిస్ ఈజిప్టి దోమ కాటు ద్వారా సంక్రమిస్తుందని, కావున ప్రతి ఒక్కరూ దోమలు వ్యాప్తిచెందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ ర్యాలీలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. బి.మీనాక్షీ, అదనపు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.ఎన్.అనురాధ,వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS