SAKSHITHA NEWS

WhatsApp Image 2023 06 30 at 1.56.23 PM

బి.ఎల్.ఓలు భాధ్యతగా పనిచేయాలి – తిరుపతి ఓటర్ నమోదు అధికారి హరిత ఐఏఎస్
సాక్షిత : తిరుపతి నియోజకవర్గం బూత్ లెవల్ ఆఫిసర్స్ సమీక్ష సమావేశం తిరుపతి ఎస్వీ యూనివర్శిటి ఆడిటోరియంలో తిరుపతి అసెంబ్లీ ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ ఆధ్యర్యంలో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ భాలాజీ మాట్లాడుతూ కొత్త ఓటర్ల జాబితను కరెక్ట్ గా తీసుకురావలని, ఎలాంటి అభియోగాలకు తావివ్వరాదన్నారు. ఇప్పటికే వున్న ఓటర్ లిస్టులోని పేర్లను క్షుణ్ణంగా నేరుగా వెల్లి పరిశీలించాలని, అదేవిధంగా కొత్త ఓటర్లని చేర్చడం, మృతి చెందిన వారిని ఓటర్ జాబితా నుండి తొలగించేలా పని చేయాలన్నారు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్ నమోదు అధికారి, తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ హరిత ఐఏఎస్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ఫోటో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ జరుగుతున్నదని, జూలై 21 నుండి ఆగస్టు 21 వరకు ప్రతి ఒక్క బూత్ లెవల్ ఆఫిసర్స్ మీకు కేటాయించిన ప్రాంతంలోని ఇంటింటికి వెల్లి ఓటర్ జాబితాను పరిశీలించాలన్నారు. 18 సంవత్సరాలు నిండిన వారిని కొత్త ఓటర్లగా నమోదు చేయించేందుకు ధరఖాస్తు చేయించాలని, చనిపోయిన వారిని తొలగించేటప్పుడు నియమ నిబంధనలు ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రతి ఒక్క బూత్ లెవర్ ఆఫిసర్స్ బారంతో కాకుండ భాధ్యతతో పని చేయాలని కమిషనర్ హరిత ఐఏఎస్ స్పష్టం చేసారు. ఈ సమిక్షా సమావేశంలో అర్భన్ ఎమ్మార్వో వెంకటరమణ, తిరుపతి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, డిటి జీవన్, సూపర్ వైజర్లు, బి.ఎల్.ఓలు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS