అసెంబ్లీ సమావేశాల్లో గిరిజనులకు అండగా నిలిచిన ప్రశాంతమ్మ
సాక్షిత : గిరిజనుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు
నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో పడుగుపాడు చంద్రమౌళి నగర్ గతంలో ఎంతో మంది ఎమ్మెల్యేలుగా ఉన్న గిరిజనులు గురించి ఎవరూ పట్టించుకుంది లేదు ఓటు బ్యాంక్ లాగా చూశారా తప్ప గిరిజనులకు ప్రత్యేక కార్పొరేషన్ తేవాలని,విద్య పరంగా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా పేదరికంలో మగ్గుతున్న గిరిజనుల గురించి ఏ శాసనసభ్యులు ఆలోచించలేదు. కానీ కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేకించి మాట్లాడినందున నియోజకవర్గంలో ఉన్న ప్రతి గిరిజన కుటుంబంలో ఒక పండగ వాతావరణంలా ఉంది.మా గిరిజనుల తరఫున గౌరవనీయులు నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కి గౌరవనీయులు కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కి అదేవిధంగా టీడీపీ స్థానిక నాయకులైనటువంటి దారపనేని శ్రీనివాసులు నాయుడు కూడా పడుగు పాడు గిరిజనులకు అన్ని విధాలుగా ఆపదలో అండగా ఉండే వ్యక్తి కావున నెల్లూరు జిల్లా గిరిజనుల తరఫున మరియు కోవూరు నియోజకవర్గ గిరిజనుల తరఫున ప్రత్యేకించి చంద్రమౌళి యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నేషనల్ ట్రైబల్ ఫెడరేషన్ కోశాధికారి లోక్ సాయి, మాజీ వార్డ్ మెంబర్ ఏకశిర సుగుణమ్మ, చంద్రమౌళి నగర్ యువత భారీగా పాల్గొనడం జరిగింది.