SAKSHITHA NEWS

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం ‘మానవ సేవే మాధవ సేవ’

సామాజిక సేవకై అందరు పాటుపడాలి

యర్రగొండపాలెం :
నిరంతరం కుటుంబ పోషణ కోసం అందరూ వివిధ రీతిలో అనేక వేయప్రయాసాలకు గురవుతున్నారని నేటి కుటుంబ వ్యవస్థ ఆర్థిక భారంగా మిగిలిందని స్నేహపూరిత వాతావరణంలో ప్రతి ఒకరికి ఒకరు చేదోడు వాదోడుగా నిలవాలని విజయ్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ అధ్యక్షులు ఎస్ విజయ్ కుమార్ అన్నారు.


మంగళవారం యర్రగొండపాలెం పట్టణంలోని విజయ్ సోషల్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న రోగులకు పౌష్టికాహారం, బ్రెడ్ లు, సిరప్ లు, దాదాపుగా 50 మందికి ఉచితంగా పంపిణీ చేశారు. వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ‘మానవ సేవే మాధవ సేవ’ అనే దృక్పథంతో ఈ ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలను మన ప్రాంతం లో చేస్తున్నదని రోగులక వివరించారు. ఇలాంటి సేవలు సమాజానికి ఎంతో అవసరమని ఆయన కొనియాడారు. వైస్ చైర్మన్ నిరీక్షనమ్మ ను కూడా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ వైద్యశాల డాక్టర్ అనిల్ కుమార్, హెడ్సిస్టర్ మినీ జోన్స్, ఐసిటిసి కౌన్సిలర్ శ్రీనివాసరావు, సోషల్ వర్కర్ తిరుమలయ్య పాల్గొన్నారు.


SAKSHITHA NEWS