: అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు కి ఘన నివాళులు అర్పించిన ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపియస్ *
ప్రత్యేక రాష్ట్ర సాధనలో శ్రీరాములు ఆత్మత్యాగం చిరస్మరణీయం
సాక్షిత ప్రకాశం జిల్లా : అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 122 వ జయంతి సందర్భంగా జిల్లా పోలీసు కార్యాలయములో ఆయన చిత్రపటానికి జిల్లా ఎస్పీ మరియు పోలీస్ ఉన్నతాధికారులు ఫూలమాలలు వేసి ఘన నివాళులర్పించినారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం కావాలంటూ కఠోర నిర్ణయంతో 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి తన ప్రాణాలను అర్పించారని కొనియాడారు.ఆంధ్ర ప్రజల చిరకాల స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు అహింసాయుత సత్యాగ్రహం ద్వారా ఆత్మ బలిదానం చేసి ఆంధ్ర రాష్ట్ర అవతరణతో పాటు భారతదేశంలో బాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతుడయినాడని, మహాత్మా గాంధీ బోధించిన సత్యము, అహింస హరిజనోద్ధరణ అనే ఆశయాలకొరకు కృషి చేశారని, అందుకే ఆ మహోన్నత వ్యక్తిని స్మరించుకోవడం గర్వించదగ్గ విషయమన్నారు. అమర జీవి కథ నేటి యువతరానికి మార్గదర్శకమై భవ్య భావోన్నత భవిష్య నిర్మాణానికి ప్రేరణ అని, ప్రతి ఒక్కరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర, దేశాభివృద్ధిలో తమ వంతు పాత్ర పోషించాలని జిల్లా ఎస్పీ కోరారు.
ఈ కార్యక్రమంలో ASP (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, AR అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, DSB DSP బి.మరియాదాసు, AR డిఎస్పీ వెంకటేశ్వరావు, DPO AO శ్రీమతి యం.సులోచన, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, హరిబాబు, ఏఆర్ ఎస్సైలు, డీపీఓ సిబ్బంది మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.