సకాలంలో స్పందించి యువకుడి ప్రాణాలు కాపాడిన ప్రకాశం జిల్లా పోలీసులు.
ఈ రోజు మధ్యాహ్నం 3.00 గం. సమయంలో కంభం మండలానికి చెందిన హమీద్ అనే వ్యక్తి తన అన్న జీవితం మీద విరక్తి చెంది చనిపోతున్నాడని తమకు ఫోన్ చేశాడని తన వదినతో కలిసి వచ్చి మార్కాపురం రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించిన ట్రైనింగ్ ఐపీఎస్ అంకిత సురాన గారు తన సిబ్బంది మరియు ఐటీ కోర్ టీమ్ సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ఆత్మహత్య చేసుకోబోతున్న వ్యక్తిని త్రిపురాంతకం మండలం, దూపాడు గ్రామంలోని నాగార్జునసాగర్ కెనాల్ వద్ద గుర్తించి అతని పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చినారు .
అనంతరం ట్రైనింగ్ ఐపీఎస్ అంకిత సురాన గారు అతనికి కౌన్సిలింగ్ నిర్వహించి అతని కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు. సకాలంలో స్పందించి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీస్ వారికి అతని యొక్క కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.
తక్షణమే స్పందించి యువకుని ప్రాణాలు కాపాడిన ట్రైనీ ఐపీఎస్ అంకిత సురాన గారిని, మార్కాపురం రూరల్ ఎస్సై వెంకటేశ్వర నాయక్, ఐటీ కోర్ టీం సిబ్బందిని ను జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించారు.